రాయదుర్గం: రాయదుర్గంలో KGF తరహా వెట్టిచాకిరీ.. 98 మంది వలస కూలీలకు REDS ద్వారా విముక్తి
KGF సినిమాలో బంగారు గనుల్లో కూలీలను బానిసలుగా మార్చి శ్రమదోపిడీ చేసిన తరహాలో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ‘నల్ల బంగారం’ బొగ్గు తయారీ బట్టీల్లో వలస కూలీలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న దారుణం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ ప్రాంతం నుంచి తక్కువ కూలీ ఆశ చూపి వందల మందిని తీసుకొచ్చి బొమ్మనహల్, రాయదుర్గం, డి.హీరేహల్ మండలాల్లో గత ఐదేళ్లుగా బొగ్గుల బట్టీల్లో రాత్రింబవళ్లు కనీస వేతనం లేకుండా పని చేయిస్తున్నారు. ఎదురు తిరిగితే గొడ్డును బాదినట్లు కట్టేసి కొట్టేవారని బాధితులు వాపోయారు. గర్భిణీలు, చిన్న పిల్లలు, వృద్ధులు సైతం రోజంతా బొగ్గులు కాల్చాల్సిందే.