ఉరవకొండ: బెలుగుప్ప తండాలో శ్రీ గౌరసంద్ర మారెమ్మ జాతర వార్షికోత్సవంలో కొండముల్లకంపలపై శయనించి బీభత్స విన్యాసాలు చేసిన పూజారి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బెలుగుప్ప తాండ గ్రామంలో మంగళవారం శ్రీ గౌరసంద్ర మారెమ్మ జాతర వార్షికోత్సవ పూజలు ప్రత్యేకతను చాటాయి. అమ్మవారి పూజారి చంద్రనాయక్ స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎలాంటి రక్తస్రావం లేదు భయం అంతకన్నా లేకుండా ముళ్ల కంపలపై భీభత్స విన్యాసాలతో శయనించి అంతుచిక్కని భక్తిని చాటింది. అశేష జనవాహిని మధ్య గౌరుసంద్రం మారెమ్మ జాతర ఉత్సవాలు ప్రత్యేకతను చాటాయి.