కొత్తగూడెం: పాల్వంచ: అదనపు కట్నం కోసం వేధింపులు.. భర్త, అత్త, ఆడపడుచుపై మహిళ ఫిర్యాదు
పాల్వంచ మండలం ఉల్వనూర్ గ్రామానికి చెందిన గోపి శ్యామల తనపై అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్న భర్త నవీన్, అత్త లక్ష్మి, ఆడపడుచు నాగమణిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.3 లక్షల కోసం తనను కొట్టి ఇంటి నుండి బయటకు గెంటేశారని బాధితురాలు పేర్కొంది.