యర్రగొండపాలెం: పెద్దారవీడులో ఎల్లమ్మ కొలుపులలో పాల్గొన్న ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండల కేంద్రంలో ఎల్లమ్మ కొలుపులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యాలు కాయ కర్పూరం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ముందుగా దేవత ప్రతిమ బొల్లావులతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.