యర్రగొండపాలెం: మాచర్ల వద్ద రోడ్డు ప్రమాదంలో పుల్లలచెరువు మండలం, కొమరోలు కు చెందిన వెంకటరామయ్య మృతి
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం, కొమరోలు కు చెందిన వెంకటరామయ్య రమేష్ బైక్ పై వెళ్తుండగా మాచర్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో వెంకటరామయ్య అక్కడికక్కడే మృతి చెందారు. రమేష్ తీవ్రంగా గాయపడటంతో స్థానిక హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.