రాయదుర్గం: డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసిన విఆర్ఏ లు, పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
డిమాండ్ల సాధన కోసం తగ్గేదే లేదంటూ గ్రామ రెవిన్యూ సహాయకులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. గత 13 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న విఆర్ఏ లు ర్యాలీ నిర్వహించి మంగళవారం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ సూర్యప్రతాప్ కు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమకు వేతనాలు పెంచకుండా వెట్టి చాకిరీ చేయించుకోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ హామీ మేరకు విఆర్ఏ లకు పే స్కేల్ అమలు చేయాలని, కనీస వేతనం రూ. 21 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.