మరిపెడ: మరిపెడ అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా పంచామృత అభిషేకం
మరిపెడ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్రం సందర్భంగా శనివారం దేవాలయంలో ప్రత్యేక పంచామృత అభిషేకం నిర్వహించారు. అర్చకులు బుక్కమఠం నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో ఆలయ చైర్మన్ గోలి జోషిత్ మణికంఠ, ధర్మకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.