రాప్తాడు: నందమూరి తారక రామారావు పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి రాప్తాడు బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో మంగళవారం 12 గంటల పది నిమిషాల సమయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నందమూరి తారకరామారావు పరిటాల రవీంద్ర ఆవిష్కరించి అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడని పరిటాల రవీంద్ర కూడా పేదల పక్షాన నిరంతరం పోరాటం చేసిన గొప్ప వ్యక్తుల విగ్రహాలు ఆవిష్కరించడం ఆనందంగా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాప్తాడు టిడిపి బహిరంగ సభలో పేర్కొన్నారు.