కొండపి: సింగరాయకొండలో పేకాట ఆడుతున్న ఐదు మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని సుందర్ నగర్ ఎస్టి కాలనీలో పేకాట ఆడుతున్న ఐదు మందిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.1,710 నగదు స్వాధీనం చేసుకొని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పేకాట ఆడటం చట్టరీత్య నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.