రాయదుర్గం: రైతులకు నీరు ఇచ్చే వరకు పోరాటం ఆగదు : వైసిపి నియోజకవర్గ ఇంచార్జ్ మెట్టు గోవిందరెడ్డి
రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు, బొమ్మనహాల్, హిరేహాల్ మండలాల్లోని HLC ఆయకట్టు రైతులకు కనీసం ఆరుతడి పంటలకైనా నీరు వదిలేదాకా మా పోరాటం ఆగదని YCP నియోజకవర్గ ఇంచార్జ్ మెట్టు గోవిందరెడ్డి స్పష్టం చేశారు. బొమ్మనహల్ మండలం గోనేహళ్ వద్ద శనివారం రైతులతో కలిసి రోడ్డు దిగ్భంధం కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. తుంగభద్ర డ్యాంలో 98 TMC లు నీరుందని, 1500 క్యూసెక్కులు కాలువలో వెళుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో సాగు నీరివ్వకపోతే రైతులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.