రాయదుర్గం: పట్టణంలో అర్ధరాత్రి దొంగల హల్చల్, స్థానికుల్లో భయాందోళన
రాయదుర్గం పట్టణం తహసీల్దార్ రోడ్డు, పెద్ద మసీదు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. సుమో లో వచ్చిన 4 గురు అనుమానాస్పద వ్యక్తులు చుట్టుపక్కల ఇళ్ల వద్ద సంచరిస్తుండగా స్థానికులు గమనించారు. అనుమానంతో కేకలు వేయడంతో దొంగలు పరుగున వెళ్లి వాహనంలో పారిపోయారు.గతంలో కూడా పందుల దొంగలు బొలెరో వాహనంలో వచ్చి ఇదే ప్రాంతంలో అల్లరి చేశారు. వరుస సంఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పూట పోలీసు గస్తీ పెంచాలని, దొంగలను వెంటనే పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.