సంతనూతలపాడు: ఆర్ ఎల్ పురంలో పర్యటించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
చీమకుర్తి మండలం ఆర్.ఎల్. పురంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయకుమార్, జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలువలోని మురుగును పారతో తొలగించారు. గ్రామాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు అవగాహన కల్పించారు.