రాయదుర్గం: పట్టణంలో 'మెగా' అభిమానుల మెగా రక్తదాన శిబిరం, స్వచ్చందంగా రక్తదానం చేసిన యువకులు
సినీ ప్రముకుడు మెగాస్టార్ చిరంజీవి 71 వ జన్మదినం సందర్భంగా రాయదుర్గం పట్టణంలో మెగా అభిమానులు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కెబి హరికృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరంతో పాటు అన్నదానం, మొక్కలు నాటే సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక సమైక్యాంధ్ర భవనంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్యానల్ మెంబర్, ప్రాణ రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ కంచె లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం వందమందికి పైగా యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాతలకు ప్రసంశ పత్రాలు అందజేశారు.