రాయదుర్గం: నారా లోకేష్ పర్యటన విజయవంతం చేయండి : కాలువసన్నన్న
రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25 న జరిగే రాష్ట్ర మంత్రి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పర్యటన విజయవంతం చేయాలని గుమ్మగట్ట మండల కన్వీనర్ కాలువసన్నన్న పిలుపునిచ్చారు. శనివారం గుమ్మగట్ట మండల టిడిపి నాయకులు, కార్యకర్తలతో టిడిపి కార్యక్రమంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గంలో నారా లోకేష్ కు 5 వేల మందితో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని కోరారు.