రాయదుర్గం: వెట్టి నుంచి విముక్తి కల్పించిన కూలీలను సురక్షితంగా స్వగ్రామాలకు పంపిన అధికారులు
వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించిన 98 మందిని అధికారులు సురక్షితంగా స్వగ్రామాలకు పంపారు. రాయదుర్గం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బొగ్గు బట్టీల్లో మగ్గిపోతూ వెట్టి చాకిరీ కి గురైన వీరిని REDS సంస్థ ద్వారా అధికారులు విముక్తి కల్పించారు. రాత్రి 10 గంటల సమయంలో రిలీజింగ్ ఆర్డర్ లు ఇచ్చి రెండు ఆర్టీసి బస్సులు ఏర్పాటు చేసి మహారాష్ట్ర లోని రాయఘర్ కు పంపారు. ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ సూర్యప్రతాప్ రఘు, REDS డైరెక్టర్ బానూజ దగ్గర ఉండి వారిని సురక్షితంగా పంపించారు..