సంతనూతలపాడు: ఉప్పుగుండూరులో వైభవంగా ఆలయ గర్భ గోపుర విమాన శిఖర ప్రతిష్టాపన కార్యక్రమం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో శ్రీ అంకాల పరమేశ్వరి, శ్రీ మహాలక్ష్మి ఆలయ గర్భగోపుర విమాన శిఖర ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు యజ్ఞ హోమాలను భక్తులచే వైభవంగా జరిపించారు. తదుపరి విమాన శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం జరిపించారు. అనంతరం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్న ప్రసాదాలను వితరణ చేశారు.