కొండపి: కొండపి పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షం, కురుస్తున్న వర్షాలతో రైతులు హర్షం
ప్రకాశం జిల్లా కొండపి పరిసర ప్రాంతాలలో గురువారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు భారీగా తగ్గిపోవడం వల్ల నీటి శాతం తగ్గిందని దీంతో ఈ వర్షాలు కురవడం వల్ల కొంతవరకు ప్రజలకు ఉపశమనం కలుగుతుందని రైతన్నలు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈనెల 19 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఉరుములు మెరుపులు పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ప్రజలు ఉండవద్దని వాతావరణ శాఖ తెలిపింది.