రాయదుర్గం: పట్టణంలోని బిటిపి లేఔట్ వద్ద బొలెరో, బైక్ డీ, ముగ్గురు పరిస్థితి విషమం
రాయదుర్గం పట్టణ శివారులోని బిజెపి లేఔట్ వద్ద శుక్రవారం మద్యాహ్నం బొలెరో బైక్ డీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న పులకుంట గ్రామానికి చెందిన సత్యన్న అతని బార్య, సరస్వతి, కూతురు గాయత్రీ, కుమారుడు మణికంఠ తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనం రాకపోవడంతో సమాచారం అందుకున్న ఎస్ఐ సురేష్ ఘటన స్థలానికి చేరుకుని తన వాహనంలో వీరిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తరలించారు. సత్యన్న విశాఖపట్నం సమీపంలో కేబుల్ గుంతలు తీసే పని చేసుకుని జీవనం సాగించేవాడు. గురువారమే స్వగ్రామానికి వచ్చాడు.