గిద్దలూరు: రాచర్లలో సర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా 6000 మందికి నోటీసులు జారీ చేశామని తహసిల్దార్ వెంకటేశ్వర్లు వెల్లడి
సర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా నోటీసులు వచ్చిన ఓటర్లు తమ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి సహకరించాలని రాచర్ల తహసిల్దార్ లోకోసారి వెంకటేశ్వర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాచర్ల మండలంలో 26 వేలకు మందికి పైగా ఓటర్లు ఉన్నారని సర్ సర్వే కార్యక్రమంలో గుర్తించినట్లు తెలిపారు. మరో 6000 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేసి ఉన్నామని వారికి కేటాయించిన తేదీల ప్రకారం సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అధికారులకు సహకరించాలన్నారు. అంతేకాకుండా పేర్లలో తప్పులు ఉంటే సరిచేస్తామని వెంకటేశ్వర్లు తెలిపారు.