తాడిపత్రి: యాడికి మండలంలో డూప్లికేట్ సెల్ ఫోన్ లను విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు
యాడికి మండలంలో డూప్లికేట్ సెల్ ఫోన్లను ఒరిజినల్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మధ్య ప్రదేశ్కు చెందిన వారు సెల్ఫోన్ విలువ రూ.23,000 అని, ఛార్జీలకు డబ్బులు లేకపోవడంతో రూ.5000కి ఇస్తామని నమ్మబలుకుతున్నారు. దీంతో కొందరు కొనుగోలు చేసిన సెల్ఫోన్లు డూప్లికెట్ అని తేలడంతో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.