కనిగిరి: కనిగిరి బల్లిపల్లి ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థి రాజ్యలక్ష్మి
కనిగిరి మండలం బల్లిపల్లి ఎంపీటీసీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమమే తనను గెలిపిస్తాయని రాజ్యలక్ష్మి అన్నారు.