ఉరవకొండ: వినాయక చవితి వేడుకలకు పోలీసులు విద్యుత్ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గ్రామాల్లో ఈనెల 14 నుండి ప్రారంభమయ్యే వినాయక చవితి వేడుకలకు పోలీసులు మరియు విద్యుత్ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి అని బెల్గిప్పు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను ప్రజలు నిర్వహించుకోవాలన్నారు. వినాయక నిమజ్జనం కార్యక్రమాల్లో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ చిన్నారులను, పిల్లలను చెరువులు వాగులు రిజర్వాయర్ల వద్దకు తీసుకెళ్లరాదని ఎస్సై సూచించారు.