ఉరవకొండ: బెలుగుప్ప తండా గ్రామంలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షానికి నేలమట్టమైన మొక్కజొన్న పంట
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బెలుగుప్ప తండా గ్రామానికి చెందిన రైతు శంకర నాయక్ సాగు చేసిన మూడు ఎకరాలు మొక్కజొన్న ఆదివారం ఉదయం బలమైన ఈదురు గాలులతో కూడి కురిసిన భారీ వర్షానికి పంట నేలపాలు అయింది. రైతు శంకర్ నాయక్ మూడు ఎకరాలు రూ.50,000 గుత్తకు తీసుకొని మొక్కజొన్న పంట సాగు చేశాడు, పంట నష్టం , చేను గుత్త నష్టం మొత్తంగా లక్ష రూపాయలు మొత్తంగా రూ. 1 50,000 రూపాయలు నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని అధికారులను రైతు కోరాడు.