రాయదుర్గం: కణేకల్లు క్రాస్ అంబేడ్కర్ గురుకులంలో నీటి కష్టాలు యధాతథం దుర్గంధం మద్యే విద్యార్థుల నరకయాతన
కణేకల్లు క్రాస్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో నీటి సమస్య తీరకపోగా మరింత జటిలమై విద్యార్థులు దుర్గంధం మద్య నరకయాతన అనుభవిస్తున్నారని తల్లిదండ్రులు ఆదివారం ఆందోళన కు ఆందోళనకు దిగారు. 650 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో నీరు లేక బాత్ రూమ్, టాయిలెట్ లు దుర్గంధంతో నిండిపోయాయి. విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వార్తా కథనాలు వచ్చాయి అప్పుడు తాత్కాలికంగా ట్యాంకర్లతో నీరు పంపారు. ఆ తర్వాత పరిస్థితి యధాతధంగా మారింది. దీంతో ఆదివారం పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రుల వద్ద విద్యార్థులు తమ గోడు వెల్లబోసుకున్నారు.