ఉరవకొండ: వరణుడి కరుణ కోసం తొమ్మిది గ్రామాల మీదుగా భజనలు చేస్తూ నరసాపురం గ్రామస్తులు పాదయాత్ర
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం నరసాపురం గ్రామానికి చెందిన రైతులు గ్రామ ప్రజలు కలసి మంగళవారం వరుణుడి కరుణ కోసం 9 గ్రామాల మీదుగా భజనలు చేస్తూ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. నరసాపురం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో తొలుతగా ప్రత్యేక పూజలు చేసి భజనలు ప్రారంభించి గ్రామం చుట్టూ ఉన్న తొమ్మిది గ్రామాలలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వరుణుడి కరణ కోసం పాదయాత్ర తో భజనలు చేశారు. అనంతరం నరసాపురం గ్రామం చేరుకుని అన్న సందర్భంగా నిర్వహించారు. ఎండిపోతున్న పంటలకు సమృద్ధిగా వర్షాలు కురవాలని పాదయాత్రలతో భజన కార్యక్రమాన్ని చేపట్టేమన్నారు.