కొండపి: ప్రకాశం జిల్లాలో సైబర్ నేరాలపై విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు, ఓటిపి చెప్పరాదని వెల్లడి
ప్రకాశం జిల్లాలో సైబర్ నేరాల బారిన పడకుండా విద్యార్థులకు ప్రజలకు పోలీసులు శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బ్యాంకు అధికారులమని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి మీ బ్యాంకు ఖాతా నంబరు ఓటిపి నంబరు అడిగితే చెప్పరాదని అలా చెబితే మీ బ్యాంకు ఖాతాలో నుంచి సైబర్ నేరగాళ్లు నగదు దొంగిలించే అవకాశం ఉందని పోలీసులు ప్రజలను విద్యార్థులను హెచ్చరించారు. ఫైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారి బారిన పడకుండా చూడాలని తెలిపారు.