రాయదుర్గం: మద్యవర్తులను నమ్మి మోసపోవద్దు : రాయదుర్గం తహసీల్దార్ సూర్యప్రతాప్
మద్యవర్తులను నమ్మి ప్రభుత్వ లే ఔట్ లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని రాయదుర్గం తహసీల్దార్ సూర్యప్రతాప్ తెలిపారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. బుధవారం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో పిజిఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై మీడియా సమావేశం నిర్వహించారు. గత నెలలో 30 వినతులు రాగా 12 పరిష్కారం అయ్యాయని మిగతావి పురోగతిలో ఉన్నాయన్నాయని వివరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతీ సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పిజిఆర్ఎస్ లో ప్రజలు నేరుగా పిర్యాదు చేస్తే చట్టప్రకారం తప్పకుండా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.