రాప్తాడు: నాగసముద్రం విద్యుత్ సబ్‌స్టేషన్ లో 25 మంది రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రైతులకు పంపిణీ చేసిన MLA పరిటాల సునీత
సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం నాగసముద్రం గేట్ వద్ద విద్యుత్ సబ్‌స్టేషన్ లో శనివారం మూడు గంటల 45 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత 25 మంది రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ నాగసముద్రం విద్యుత్ సబ్‌స్టేషన్ నందు 25 మంది రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేయడం జరిగిందని రైతులకు మెరుగైన విద్యుత్ అందించాలని ఉద్దేశంతోనే దరఖాస్తు చేసుకున్న 25 మంది రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్లలో పంపిణీ చేశామని రైతులకు నానమైన విద్యుత్‌ను అందిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.