రాప్తాడు: హంపాపురం 44 జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సుబ్బరాయుడును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం 44వ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో హంపాపురం 44 జాతీయ రహదారి పైన సుబ్బరాయుడు 61 సంవత్సరాలు వ్యక్తి స్పెండర్ వాహనంపై పెట్రోల్ వేయించుకునేందుకు వస్తున్న సందర్భంలో గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి సుబ్బరాయుడు ద్విచక్ర వాహనాన్ని వెనకాల వైపు నుంచి ఢీకొట్టడంతో సుబ్బరాయుడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన పైన రాప్తాడు ఎస్సై వెంకటేశులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని ఎస్సై వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపడుతున్నారు, మృతి దేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు రాప్తాడు పోలీసులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు.