గిద్దలూరు: మార్కాపురం జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచిన పోలీసులు, స్కై ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని చేపట్టిన అధికారులు
మార్కాపురం జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెంచారు. ఆదివారం అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెట్టిన అధికారులు స్కై ప్రాజెక్టు కార్యక్రమాన్ని చేపట్టి డ్రోన్ ఎగరవేశారు. పేకాట కోడిపందాలను అరికట్టేందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో స్కై ప్రాజెక్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎక్కడైనా నేరాలను ప్రజలు గుర్తిస్తే 9121102266 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.