సంతనూతలపాడు: చీమకుర్తిలోని జగనన్న కాలనీలో దారుణం, కుటుంబ కలహాలతో అత్తను హత్య చేసిన అల్లుడు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తిలోని గంగవరం రోడ్డులో గల జగనన్న కాలనీలో ఎస్కే మిరాబీ (52) దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆమె అల్లుడు ఈ హత్యకు పాల్పడినట్లు మృతురాలి కుమార్తె (నిందితుడి భార్య) పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.