ప్రకాశం జిల్లా చీమకుర్తి సర్కిల్ సీఐ దాసరి ప్రసాద్ మద్యం తాగి ద్విచక్ర వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా యువత ద్విచక్ర వాహనాలతో తిరుగుతూ మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఉంటారని అటువంటివి చేయకుండా ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సిఐ ప్రసాద్ వాహనదారులకు సూచించారు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.