ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శనివారం వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిబంధనలు పాటించని ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా వాహనం సంబంధిత ధ్రువపత్రాలతో పాటు వాహనం నడుపుతున్న వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.