ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ శుక్రవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక భద్రత మరియు ట్రాఫిక్ సంబంధిత సమస్యలపై ఎస్పీతో ఎమ్మెల్యే మాట్లాడారు. తర్వాత ఇరువురు కాసేపు వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విజయ్ కుమార్ కు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.