ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ ప్రజా దర్బార్ శుక్రవారం నిర్వహించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ప్రజలు తరలి వచ్చారు. వారి సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. మొత్తంగా 25 అర్జీలు వచ్చాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.