ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలో బుధవారం ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు పెన్షన్లు అందిస్తున్నారని నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒక్కరోజు ముందుగానే సీఎం చంద్రబాబు పెన్షన్ దారులకు పెన్షన్లు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్నారు.