ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి ఒకటి సెలవు రోజు కాబట్టి ముందస్తుగా ఈనెల 31వ తేదీ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నట్టు ఎంపీడీవో సురేశ్ బాబు తెలిపారు. మండలంలోని 15 సచివాలయాల పరిధిలో 6653 మంది లబ్ధిదారులకు రూ.2.89 కోట్లు రూపాలను పంపిణీ చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.