కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాగునీటికి భరోసా: ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో వచ్చే వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని మళ్లించి 20 చెరువులను నింపడం ద్వారా తాగునీటి భద్రతతో పాటు 9,436 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భరోసా కల్పించారు.