రాప్తాడు: రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంకాలం వరకు 46 మంది ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రాప్తాడు మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో 46 మంది అభ్యర్థులు నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవి తెలిపిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం నుంచి సాయంకాలం వరకు 46 మంది నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని అందులో 24 మంది ఎంపీటీసీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ తరఫున 20 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని రాప్తాడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవి పేర్కొన్నారు.