యర్రగొండపాలెం: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలలో పర్యటించిన బిజెపి జిల్లా అధ్యక్షులు కృష్ణారావు
పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు పర్యటించారు. ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోతున్న వారి త్యాగాలను మరవలేని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులను సన్మానించారు. వెలుగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాలను విడుదల చేస్తే 50 టీఎంసీల నీరు ముంపు గ్రామాలలో చేరి మునిగిపోతాయని వివరించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.