రాప్తాడు: బొమ్మపర్తి గ్రామంలో 13 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసిన టిడిపి మండల కన్వీనర్ కొండప్ప
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మెపర్తి లింగన్న పల్లి గ్రామాల మధ్య మంగళవారం నాలుగు గంటల 45 నిమిషాల సమయంలో రాప్తాడు టిడిపి మండల కన్వీనర్ కొండప్ప 13 లక్షల రూపాయలతో నిర్మించే సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండప్ప మాట్లాడుతూ లింగానపల్లి గ్రామాల మధ్య 13 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు పరిటాల సునీత ఆదేశాలు మేరకు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగిందని రాప్తాడు టిడిపి మండల కన్వీనర్ కొండప్ప పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో దగ్గుపాటి శీన రాజశేఖర్ రెడ్డి ఉజ్జినప్ప గ్రామస్తులు పాల్గొన్నారు.