నారాయణపేట్: సెప్టెంబర్ 4న నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన: ఏర్పాట్ల పరిశీలన
సెప్టెంబర్ 4న నారాయణపేట జిల్లా మద్దూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ఏర్పాట్లను పరిశీలించారు. మద్దూరులో జరుగుతున్న అభివృద్ధి పనులు, హెలిప్యాడ్ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు.