కనిగిరి: నాగులుప్పలపాడులో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన డీఎస్పీ
నాగులుప్పలపాడు ఎంపీపీ కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగాలని, ఎటువంటి గొడవలకు తావు లేకుండా కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.