సంతనూతలపాడు: పేర్ణమిట్టలో చిరుధాన్యాలపై అవగాహన ర్యాలీ
సంతనూతలపాడు మండలం పేర్ణమిట్టలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూపర్వైజర్ అనురాధ సూచించారు.