కొత్తగూడెం: 13వ రోజుకు చేరిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమ్మె
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. 13వ రోజుకు చేరిన ఈ ఆందోళనకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మద్దతు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం, లిఖితపూర్వక హామీ కోరుతూ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు.