రాయదుర్గం: డి.హిరేహాల్ మండలంలో ప్రశాంతంగా ఎస్ఎంసీ ఎన్నికలు
డీ.హీరేహల్ మండలంలో SMC ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. H.సిద్దాపురం ZP హైస్కూల్ SMC అధ్యక్షుడిగా చందు నాయక్, ఉపాధ్యక్షురాలిగా చిగరి మంజుల ఎన్నికయ్యారు. MPUP స్కూల్ అధ్యక్షుడిగా S.K.B.రమేష్ గౌడ్, ఉపాధ్యక్షురాలిగా చిగరి లక్ష్మీదేవి ఎన్నికయ్యారు. హెడ్మాస్టర్లు గౌరీశంకర్, సూర్యనారాయణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బోయ వన్నూరు స్వామి, మాజీ ఉపసర్పంచ్ శివ నాయక్, గవియప్ప తదితరులు నూతన కమిటీని సన్మానించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.