రాప్తాడు: అనంతపురంలో 33 మంది కి 19 లక్షల20 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం 11:30 సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలాలకు చెందిన 33 మంది కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ అనంతపురంలో రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు 19 లక్షల 20 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 75 మందికి 11 కోట్ల 88 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహకారం అందించడం జరిగిందని, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు