రాప్తాడు: చిన్నాయనగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్నయ్య నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో శుక్రవారం 10:30 గంటల సమయంలో ఉపకులపతి సుదర్శన్ రావు మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ బ్రిటిష్ పాలనపై అహింసాత్మకంగా పోరాడి స్వతంత్రం సాధించడానికి దేశ ప్రజలను ఒక తాటికపై తీసుకువచ్చిన గొప్ప వ్యక్తిని అటువంటి గాంధీజీ మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని జెఎన్టియు ఉపకులపతి సుదర్శన్ రావు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో రిజిస్టర్ దుర్గాప్రసాద్ దేవన్న సత్యనారాయణ నాగప్రసాద్ నాయుడు పాల్గొన్నారు.