రాప్తాడు: నవయుగ కాలనీలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా పెద్దమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి అన్నదానం నిర్వహించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సోమలదొడ్డి పంచాయతీ నవయుగ కాలనీలో సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఆలయ నిర్వాహకుడు రాజు ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా పెద్దమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకుడు రాజు మాట్లాడుతూ నవయుగ కాలనీలో 2018 సంవత్సరం నుంచి పెద్దమ్మ అమ్మవారిని ప్రతిష్టించి నాటి నుంచి నేటి వరకు ప్రతి దసరాకు శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తామని 9 రోజులు పాటు అమ్మవారికి పూజలు నిర్వహించి భక్తులందరికీ అన్నదానం కూడా నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకుడు రాజు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో నవయుగ కాలనీ భక్తులంతా పాల్గొన్నారు.