రాయదుర్గం: అడవి పందుల బీభత్సం, రైతులకు లక్షల్లో పోట నష్టం
రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామ పరిధిలో రైతులు జానకమ్మ, లక్ష్మీదేవిల పొలాల్లో గత వారం రోజులుగా అడవి పందులు దాడి చేసి మొక్కజొన్న పంటను తీవ్రంగా నష్టపరిచాయి. సుమారు లక్ష రూపాయల వరకు పంటనష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, బీట్ అధికారి ఆంజనేయులు, వ్యవసాయ అధికారి ఉమాదేవి బుధవారం పొలాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. నివేదికను పై అధికారులకు పంపుతామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.